Petrol: క్రూడ్‌ ధర పడిపోయినా బంకుల వద్ద తగ్గదు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రో ధరలను వెంటనే తగ్గించే అవకాశం లేదని అధికారవర్గాలు తెలిపాయి. 15 రోజులపాటు ముడిచమురు ధరలు....

Updated : 29 Nov 2021 07:55 IST

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రో ధరలను వెంటనే తగ్గించే అవకాశం లేదని అధికారవర్గాలు తెలిపాయి. 15 రోజులపాటు ముడిచమురు ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించి, వాటి సగటు ఆధారంగానే దేశీయంగా బంకుల్లో విక్రయించే ధరలను నిర్ణయిస్తారని పేర్కొన్నాయి. ధరల తగ్గుదల కొద్దిరోజుల పాటు కొనసాగితేనే చిల్లర ధర ఎంత తగ్గించాలనేదానిపై కసరత్తు జరుగుతుందని తెలిపాయి. శుక్రవారం నాటికి అంతకుముందున్న 15 రోజుల సగటును లెక్కించినప్పుడు తగ్గుదల చెప్పుకోదగ్గది కాదు. ఆరోజు నుంచి మరికొన్ని రోజుల పాటు ధరలు తగ్గితేనే దాని సగటును లెక్కించి ఇక్కడా తగ్గిస్తాం. రోజువారీ ధరల్లో అధికంగా హెచ్చుతగ్గులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే 15 రోజుల ‘చలన సగటు’ను పరిగణనలోకి తీసుకుంటున్నాం. అలా కాకుండా రోజువారీ అంతర్జాతీయ ధరల ఆధారంగా లెక్కిస్తే బంకుల వద్ద ప్రతిరోజూ భారీ మార్పులు కనిపిస్తుంటాయి’’ అని అధికారవర్గాలు వివరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని