
Covaxin: కొవాగ్జిన్‌కు అనుమతిపై వచ్చేవారం తుది నిర్ణయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
దిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 టీకా ‘కొవాగ్జిన్’కు ‘అత్యవసర వినియోగ లిస్టింగ్’ (ఈయూఎల్) హోదా ఇచ్చే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వచ్చే వారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంగళవారం ట్వీట్ చేసింది. ‘‘డబ్ల్యూహెచ్‌వో, స్వతంత్ర నిపుణులు వచ్చేవారం సమావేశం కానున్నారు. టీకాపై మదింపు చేస్తారు. కొవాగ్జిన్‌కు ఈయూఎల్ ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు’’ అని వెల్లడించింది. కొవాగ్జిన్‌పై సిఫార్సులు చేయడానికి డబ్ల్యూహెచ్‌వోకు సంబంధించిన వ్యూహాత్మక నిపుణుల సలహా బృందం మంగళవారం సమావేశమైందని తెలిపింది. ‘‘టీకాకు సంబంధించిన డేటాను భారత్ బయోటెక్ సమర్పించింది. గత నెల 27న అదనపు వివరాలను అందించింది. దీనిపై పరిశీలన జరుగుతోంది’’ అని వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.