Fire Accident: అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం: 42 మంది మత్యువాత

ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కబైలియా రీజియన్‌ బెజాయియా పర్వతానికి సమీపంలోని ప్రాంతాల్లో మంటలు ..

Updated : 11 Aug 2021 13:43 IST

అల్జీర్స్‌: ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 42 మంది మృతిచెందారు. వీరిలో 25 మంది సైనికులతో పాటు 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మంటల నుంచి సుమారు వంద మందికి పైగా ప్రజలను సైనికులు రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు సైతం మృత్యువాత పడ్డారు.

అల్జీరియాలోని దాదాపు 17 రాష్ట్రాల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. 100కు పైగా ప్రాంతాలను మంటలు అంటుకున్నాయి. చనిపోయిన సైనికులు, పౌరులకు ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్‌ మాజిద్‌ టెబ్బౌనే నివాళులర్పించారు. అనేక గ్రామాలు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాయి. అడవుల్లో పశువులు, పక్షులు మంటలకు ఆహుతైన దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. అనేక మంది ఇప్పటికే గ్రామాలను విడిచి వెళ్లిపోగా.. కొంత మంది మంటలు తమ ఇళ్లను తాకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే, కొంతమంది దుండగులు కావాలని నిప్పు పెట్టడం వల్లే ఈ మంటలు చెలరేగుతున్నాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కమెల్‌ బెల్డ్‌జౌద్‌ ఆరోపించారు. ప్రధాని సైతం ఈ తరహా అనుమానాలే వ్యక్తం చేశారు. మంటలు చెలరేగుతున్న తీరు చూస్తుంటే కచ్చితంగా కొంతమంది నేరస్థులే ఈ దుశ్యర్యకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోందన్నారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయానికి 30 ప్రదేశాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని