
ఉధంపూర్-దుర్గ్ ఎక్స్ప్రెస్లో మంటలు.. పూర్తిగా దగ్ధమైన రెండు బోగీలు
మధ్యప్రదేశ్: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. మధ్యప్రదేశ్లోని హేతంపూర్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన కాసేపటికే మంటలు చెలరేగాయి. బోగీల నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు మంటలు వ్యాపించిన బోగీలను వేరు చేశారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.