Flight: విమానం టైర్ పంక్చర్.. జనం దిగి హైలెస్సా హైలో హైలెస్సా
ప్రయాణిస్తున్న సమయంలో బైక్, కార్ ఏదైనా ఆగడం లేదా పంక్చర్ అయితే పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. చేసేదేమీ లేక తోసుకుంటూ వెళ్లిపోవడమే. అదే రన్‌వేపై విమానం టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తారు? ఇక్కడా అదే జరిగింది.
ప్రయాణిస్తున్న సమయంలో బైక్, కార్ ఏదైనా ఆగడం లేదా పంక్చర్ అయితే పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. చేసేదేమీ లేక తోసుకుంటూ వెళ్లిపోవడమే. అదే రన్‌వేపై విమానం టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తారు? ఇక్కడా అదే జరిగింది. అంతా కిందకు దిగి తలో చేయి వేసి విమానాన్ని ముందుకు తోశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నేపాల్ విమానాశ్రయంలో.. ఆ దేశానికే చెందిన టారా ఎయిర్‌లైన్ విమానం టైర్ పంక్చర్ అయింది. పైకి ఎగరలేని పరిస్థితి. కనీసం ముందుకు కూడా వెళ్లట్లేదు. విమానంలో ఎక్కినవారే.. దిగి ముందుకు తోయాల్సి వచ్చింది. ఈ వీడియోకు 50 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి కదా? అని అధికారులను తప్పుపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్