Omicron: దేశంలో మరో 8 ఒమిక్రాన్ కేసులు..49కి చేరిన బాధితుల సంఖ్య
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా తన ఉనికి చాటుతోంది. మంగళవారం దిల్లీ, రాజస్థాన్‌లో చెరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశవ్యాప్తంగా ఈ రకం కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం దిల్లీలో ఒమిక్రాన్ కేసులు ఆరుకు చేరగా.. రాజస్థాన్‌లో 13కు పెరిగాయి. దీనిపై ఆయా ఆరోగ్య శాఖ మంత్రులు స్పందించారు.
దిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. మంగళవారం దిల్లీలో నాలుగు, రాజస్థాన్‌లో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశవ్యాప్తంగా ఈ రకం కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం దిల్లీలో ఒమిక్రాన్ కేసులు ఆరుకు చేరగా.. రాజస్థాన్‌లో 13కు పెరిగాయి. దీనిపై ఆయా ఆరోగ్య శాఖ మంత్రులు స్పందించారు.
‘దిల్లీలో మరో నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆ వేరియంట్ బాధితుల సంఖ్య ఆరుకి చేరింది. వీరిలో ఓ వ్యక్తి కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 35 మంది కొవిడ్ బాధితులు, ముగ్గురు కొవిడ్ అనుమానితులు ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరారు’ అని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. రాజస్థాన్‌లో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్సాడీ లాల్ మీనా వెల్లడించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఇంతకుముందున్న ఒమిక్రాన్ బాధితులందరికీ కొవిడ్ నెగెటివ్‌గా తేలినట్లు చెప్పారు.
డిసెంబర్ 2న కర్ణాటకలో తొలుత ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. ఈ 12 రోజుల వ్యవధిలో ఆ వేరియంట్ పలు రాష్ట్రాలకు వ్యాపించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 20 మందిలో వెలుగుచూసింది. ఇదిలా ఉండగా.. గత నెల మొదట దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్.. ఇప్పటికే 60కి పైగా దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!
-
Sports News
WPL: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి