Corona: ఫ్రాన్స్‌లో కొవిడ్‌ కల్లోలం.. అత్యధికంగా ఒకేరోజు 2లక్షల కేసులు

ఫ్రాన్స్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2లక్షల కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఒలీవియర్‌ వీరన్‌ వెల్లడించారు......

Published : 29 Dec 2021 23:10 IST

ప్యారిస్‌: కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 24 గంటల వ్యవధిలో అమెరికాలో అత్యధికంగా 4.4 లక్షల కేసులు వెలుగుచూశాయని అక్కడి అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడించగా.. ఫ్రాన్స్‌లోనూ గడిచిన 24 గంటల్లో 2లక్షల కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఒలీవియర్‌ వీరన్‌ తెలిపారు. ఫ్రాన్స్‌లో మంగళవారం అత్యధికంగా 1,79,807 కేసులు బయటపడగా.. వాటిని మించి తాజాగా 2,08,000 కేసులు వెలుగుచూసినట్లు అక్కడి చట్టసభలో ఆయన వెల్లడించారు. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఫ్రాన్స్‌లో ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. జనవరి ప్రారంభంలో రోజుకు 2,50,000 కేసులు రావొచ్చని ఆయన ఇదివరకే హెచ్చరించారు.

దేశంలో ఒమిక్రాన్‌ తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. రెండు డోసులు తీసుకున్న 18 ఏళ్లు దాటినవారంతా బూస్టర్‌ డోసు తీసుకోవచ్చని కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. బూస్టర్ డోసును తీసుకుంటేనే.. తాము అందించే హెల్త్ పాస్‌లు చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం యోచిస్తోంది. కేఫ్‌లు, రెస్టారెంట్‌లు, ప్రజా రవాణా యాక్సెస్ సహా.. అంతర్జాతీయ ప్రయాణాలకు అక్కడ ఈ పాస్‌లు తప్పనిసరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని