Britney Spears: తండ్రి నుంచి బ్రిట్నీకి సంపూర్ణ స్వేచ్ఛ

ప్రముఖ పాప్‌ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్‌కు స్వేచ్ఛ లభించింది. ఆమె చేస్తున్న న్యాయ పోరాటం ఫలించి.. తండ్రి జేమ్స్‌ స్పియర్స్‌ నుంచి విముక్తి దొరికింది. ఈ మేరకు జేమ్స్‌ గతంలో పొందిన సంరక్షణ బాధ్యతలను రద్దు చేస్తూ అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Updated : 14 Nov 2021 08:32 IST

లాస్‌ఏంజెలెస్‌: ప్రముఖ పాప్‌ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్‌కు స్వేచ్ఛ లభించింది. ఆమె చేస్తున్న న్యాయ పోరాటం ఫలించి.. తండ్రి జేమ్స్‌ స్పియర్స్‌ నుంచి విముక్తి దొరికింది. ఈ మేరకు జేమ్స్‌ గతంలో పొందిన సంరక్షణ బాధ్యతలను రద్దు చేస్తూ అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బ్రిట్నీ 2008లో మానసిక సమస్యలకు గురవడం వల్ల.. ఆమె సంరక్షణ బాధ్యతలను తండ్రి జేమ్స్‌ చేపట్టారు. అప్పటి నుంచి కుమార్తె జీవిత నిర్ణయాలను, డబ్బులు, ఆస్తుల నిర్వహణను పర్యవేక్షిస్తూ వచ్చారు. అయితే, తన స్వేచ్ఛకు తండ్రి జేమ్స్‌ ఆటంకంగా మారారని, సంరక్షణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలని కొంతకాలంగా బ్రిట్నీ న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. దీంతో తాజాగా జేమ్స్‌ను సంరక్షకుడిగా తప్పిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కోర్టు వద్దకు భారీగా చేరుకున్న బ్రిట్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు