UK travel rules: రెండు డోసులు తీసుకున్నా.. అక్కడికి వెళ్తే క్వారంటైన్ తప్పనిసరి

వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న భారత ప్రయాణికులకు బ్రిటన్‌లో క్వారంటైన్ తప్పడం లేదు. బ్రిటన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ప్రయాణ నిబంధనల్లో.. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు 10 రోజుల క్వారంటైన్ నిబంధనను పెట్టడమే అందుకు కారణం.

Published : 20 Sep 2021 23:40 IST

బ్రిటన్ ప్రయాణ నిబంధనలపై భారత్‌లో నిరసన

దిల్లీ: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న భారత ప్రయాణికులకు బ్రిటన్‌లో క్వారంటైన్ తప్పడం లేదు. బ్రిటన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ప్రయాణ నిబంధనల్లో.. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు 10 రోజుల క్వారంటైన్ నిబంధనను పెట్టడమే అందుకు కారణం. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘యూకేలో అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌పై అక్కడి ప్రభుత్వ నిర్ణయం విచిత్రంగా ఉంది. పుణెకు చెందిన సీరం సంస్థ ఆ టీకాను బ్రిటన్‌కు కూడా సరఫరా చేసింది’ అంటూ వాస్తవాన్ని గుర్తుచేశారు. ఆ పార్టీకే చెందిన శశిథరూర్ ఆ దేశ నిబంధనలు అవమానకరమన్నారు. వాటి వల్ల తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. 

ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో పాటు యూఏఈ, భారత్, టర్కీ, జోర్డాన్, థాయ్‌లాండ్, రష్యాలో పూర్తిగా టీకా పొందిన వారిని అన్‌ వ్యాక్సినేటెడ్‌ అంటూ బ్రిటన్‌ ఆ నిబంధనల్లో పేర్కొంది.

 భారత్‌లో రెండు డోసులు పొందినవారికి వర్తించే నిబంధనలు..

* ప్రయాణానికి మూడు రోజుల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి.

*  ఆ దేశం చేరుకున్నాక ఇల్లు లేక ఉంటున్న ప్రదేశంలో 10 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి. 

* ఈ సమయంలో రెండు, ఎనిమిదో రోజు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. 

* బ్రిటన్‌కు రావడానికి 48 గంటల ముందు ప్యాసింజర్ లొకేటర్ ఫామ్‌ను నింపాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని