Germany: జర్మనీ నూతన ఛాన్స్‌లర్‌గా ఒలాఫ్‌ షోల్స్‌..!

జర్మనీ ఛాన్స్‌లర్‌గా 2005లో మొదలైన ఏంజెలా మెర్కెల్‌ ప్రస్థానం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో నూతన ఛాన్సలర్‌గా ఒలాఫ్‌ షోల్స్‌ను అక్కడి పార్లమెంట్‌ ఎన్నుకుంది.

Published : 09 Dec 2021 01:41 IST

అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్ స్టీన్‌మీర్‌ సమక్షంలో బాధ్యతల స్వీకరణ

బెర్లిన్‌: జర్మనీ ఛాన్స్‌లర్‌గా 2005లో మొదలైన ఏంజెలా మెర్కెల్‌ ప్రస్థానం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో నూతన ఛాన్సలర్‌గా ఒలాఫ్‌ షోల్స్‌ను అక్కడి పార్లమెంట్‌ ఎన్నుకుంది. సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఒలాఫ్‌.. మెర్కెల్‌ ప్రభుత్వంలో వైస్‌ ఛాన్స్‌లర్‌గా, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. తాజాగా జర్మనీ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఇక 16ఏళ్లపాటు జర్మనీ ఛాన్స్‌లర్‌గా ఉన్న ఏంజెలా మెర్కెల్‌ పార్టీకి ఈఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీలో ఉండడం లేదని ముందుగానే ప్రకటించినప్పటికీ.. తన పార్టీని గెలుపించుకోవడంలో విఫలమయ్యారు. తాజా ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ (CDU) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. అయితే, ప్రత్యర్థి సోషల్‌ డెమొక్రాట్‌ పార్టీకి మాత్రం స్వల్ప ఆధిక్యం దక్కింది. దీంతో ఫ్రీ డెమోక్రాట్స్‌, గ్రీన్స్‌ పార్టీల మద్దతులో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో ఎస్‌డీపీ గెలిచేందుకు కృషిచేయడంతోపాటు అంతకుముందు ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఒలాఫ్‌ షోల్స్‌వైపే పార్లమెంట్‌ సభ్యులు మొగ్గుచూపారు. మొత్తం 395 ఓట్లలో ఫోల్స్‌కు 306 మంది మద్దతు లభించింది. దీంతో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్ స్టీన్‌మీర్‌ సమక్షంలో ఛాన్స్‌లర్‌గా ఒలాఫ్‌ షోల్స్‌ బాధ్యతలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని