Published : 03/11/2021 21:52 IST

Covaxin: కొవాగ్జిన్‌కు WHO అనుమతిపై ప్రముఖుల హర్షం

జెనీవా: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు అంతర్జాతీయంగా అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నిపుణులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా వీటిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌.. ఎమర్జెన్సీ వినియోగ జాబితాలో కొవాగ్జిన్‌ చేరడం ఆనందంగా ఉందన్నారు. కొవిడ్‌ మహమ్మారితో పోరాడాలంటే ఈ జాబితాలోకి ఇలాంటివి ఎన్ని ఉత్పత్తులు వస్తే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ సమతుల్యతను పాటించడంలో భాగంగా చాలా దేశాలకు టీకాలను అందించడంపై ఒత్తిడి కొనసాగించాలన్నారు. ముఖ్యంగా కనీసం ఒక డోసు కోసం వేచిచూస్తున్న ప్రజలకు టీకా అందిచేందుకు కృషి చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సూచించారు.

కంగ్రాట్స్‌ ఇండియా: WHO చీఫ్‌ సైంటిస్ట్‌

డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర వినియోగ జాబితాలోకి కొవాగ్జిన్‌ చేరడం పట్ల ఆ సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశీయంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంతోపాటు విస్తృతంగా పంపిణీ చేసేందుకు కృషి చేసిన భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌తో పాటు కేంద్ర ఆరోగ్యశాఖకు అభినందనలు తెలిపారు.

దీపావళి గిఫ్ట్‌..

కొవాగ్జిన్‌కు అనుమతి రావడం నిజంగా భారత్‌కు దీపావళి కానుక అని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం), కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే కొవాగ్జిన్‌ తీసుకున్న ఎంతోమందికి ఊరట కలిగించే విషయమన్న ఆయన.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సమర్థమైన టీకాగా ఆమోదం పొందడం సంతోషకర విషయని చెప్పారు.

వీరితోపాటు తమ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించడం పట్ల భారత్‌ బయోటెక్‌ హర్షం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి భద్రతతో కూడిన టీకాగా ధ్రువీకరణ పొందిందని పేర్కొంది. వ్యాక్సిన్‌ కోసం వేచిచూస్తున్న ఆయా దేశాల నియంత్రణ సంస్థలు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదంతో కొవాగ్జిన్‌ దిగుమతి, పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు మార్గం సుగమమైందని అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడిన కొవాక్స్‌ కార్యక్రమానికి ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని