Sudan: సూడాన్‌లో కూలిన బంగారు గని: 38 మంది మృతి

ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని కూలి 38 మంది చనిపోయారు. ఈ విషయాన్ని సూడాన్‌

Updated : 29 Dec 2021 07:56 IST

సూడాన్‌: ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని కూలి 38 మంది చనిపోయారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సూడాన్‌ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివేసిన బంగారు గనిలో ఈ ఘటన జరిగినట్లు సూడాన్‌ మైనింగ్‌ కంపెనీ తెలిపింది. ఎనిమిది మంది మంది గాయపడినట్లు వెల్లడించింది. 

గత కొంతకాలం క్రితం ఈ గని తవ్వకాన్ని ప్రభుత్వం మూసివేసింది. అయితే బంగారం కోసం స్థానిక ప్రజలు తరుచుగా గనిలోకి వెళుతుంటారు. గనులు కూలకుండా ఉండేందుకు ప్రభుత్వం కనీస భద్రతా సౌకర్యాలు సైతం కల్పించడం లేదు. దీంతో సూడాన్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో బంగారం వెలికితీసే దేశాల్లో సూడాన్‌ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. 2020లో ఈ దేశం 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని