Harsh Goenka: ఒకేసారి 900 మంది ఉద్యోగుల తొలగింపు.. తప్పు పట్టిన గోయెంకా

జూమ్ కాల్ చేసి, ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్‌.కామ్ సీఈఓ విశాల్ గార్గ్‌ వార్తల్లో నిలిచారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా తప్పుపట్టారు. దీనిపై ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ..ఈ చర్యల ద్వారానే కార్పొరేట్లకు హృదయం లేదనే ట్యాగ్ వస్తుందని వ్యాఖ్యానించారు. 

Published : 07 Dec 2021 20:06 IST

ముంబయి: జూమ్ కాల్ చేసి, ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్‌.కామ్ సీఈఓ విశాల్ గార్గ్‌ వార్తల్లో నిలిచారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా తప్పుపట్టారు. దీనిపై ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ..ఈ చర్యల ద్వారానే కార్పొరేట్లకు హృదయం లేదనే ట్యాగ్ వస్తుందని వ్యాఖ్యానించారు. 

‘విశాల్ గార్గ్ జూమ్ వేదికగా ఒకేసారి తొలగించిన 900 మంది గురించే నేను ఆలోచిస్తున్నాను. ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం. ఈ తొలగింపుపై వ్యక్తిగతంగా వారికే చెప్పాలి. అలాగే క్రిస్మస్‌కు ముందు, ఇటీవలే 750 మిలియన్‌ డాలర్లు సమీకరించిన సమయంలో ఈ చర్య సరైంది కాదు. ఈ తీరుతోనే కార్పొరేట్లు హృదయం లేదని వారనే ముద్ర వేయించుకునేది..!’ అని గోయెంకా ట్వీట్ చేశారు. అలాగే జూమ్ కాల్‌కు సంబంధించి వీడియోను షేర్ చేశారు. 

గత బుధవారం విశాల్ తన ఉద్యోగుల్లో కొందరికి జూమ్ ద్వారా వీడియో కాల్ చేశారు. సమర్థత, పనితీరు తదితర కారణాలు చూపి, 900 మంది ఉద్యోగుల్ని ఒకేసారి తప్పిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియోను ఓ ఉద్యోగి నెట్టింట్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. గతంలో కూడా ఆయన ఒకేసారి పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. అప్పుడూ, ఇప్పుడూ ఆయన తీరు వివాదాస్పదంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు