Harsh Goenka: ఒమిక్రాన్‌ రాకతో మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోం.. నవ్వులు పూయిస్తోన్న గోయెంకా ట్వీట్..!

దేశంలో కరోనా వైరస్ కాలు మోపిన దగ్గరి నుంచి అన్ని రంగాల మీద ప్రభావం పడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల విషయంలో వినిపించే ‘వర్క్‌ ఫ్రమ్ హోం’ విధానం విపరీతంగా వాడుకలోకి వచ్చింది.

Published : 05 Jan 2022 01:38 IST

ముంబయి: దేశంలో కరోనా వైరస్ కాలు మోపిన దగ్గరి నుంచి అన్ని రంగాల మీద ప్రభావం పడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల విషయంలో వినిపించే ‘వర్క్‌ ఫ్రమ్ హోం’ విధానం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవకాశం ఉన్న ప్రతి సంస్థ తమ సిబ్బందికి ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. దాంతో చాలామంది తమ సొంతప్రాంతాలకు వెళ్లి అయినవాళ్ల మధ్య ఆడుతూపాడుతూ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. గతేడాది మే తర్వాత రెండో వేవ్ ముగిసి, కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొందరు తిరిగి కార్యాలయాలకు రావాల్సి వచ్చింది.  2022లో మిగతావారిని కూడా పిలుద్దామని భావిస్తుండగా.. ఒమిక్రాన్ వచ్చిపడింది. దాంతో అంతా మొదటికే వచ్చింది. మళ్లీ సంస్థలన్నీ వర్క్‌ఫ్రమ్‌ హోంను కొనసాగించాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని వీడియో రూపంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విటర్ వేదికగా షేర్  చేశారు. బాలీవుడ్ స్టార్స్‌ అమితాబ్ బచ్చన్, షారుక్‌ ఖాన్ నటించిన మొహబ్బతీన్ చిత్రంలోని ఆ వీడియో క్లిప్‌ను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఇప్పుడది నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని