Covid Treatment: టోసిలిజుమాబ్‌ ఔషధానికి డీసీజీఐ అనుమతి!

టోసిలిజుమాబ్‌ ఔషధాన్ని జనరిక్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చి వినియోగించుకునేందుకు హెటెరో సంస్థకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.

Published : 06 Sep 2021 23:54 IST

నెలాఖరులో అందుబాటులోకి తెస్తామన్ని హెటెరో

దిల్లీ: కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువ ఉన్న రోగుల చికిత్సలో వినియోగించే ఔషధాల్లో మరో ముందడుగు పడింది. టోసిలిజుమాబ్‌ ఔషధాన్ని జనరిక్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చి వినియోగించుకునేందుకు హెటెరో సంస్థకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని హెటెరో డ్రగ్స్‌ సోమవారం వెల్లడించింది. దీంతో టొసిరా (Tocira) బ్రాండ్‌ రూపంలో ఈ నెల చివరినాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెటెరో సంస్థ పేర్కొంది. ఇక ఈ ఔషధాన్ని హైదరాబాద్ కేంద్రంలోనే తయారు చేయనున్నట్లు తెలిపింది.

‘ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి మరోసారి పెరుగుతుండడంతో పలు దేశాల్లో ఈ ఔషధం కొరత ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో భారత్‌లో సరఫరా సజావుగా సాగేందుకు ఈ అనుమతి ఎంతో కీలకం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం’ అని హెటెరో గ్రూప్‌ ఛైర్మన్‌ పార్థసారథి రెడ్డి పేర్కొన్నారు.

ఇక ఆర్థరైటిస్‌ కోసం వినియోగించే టోలిసిజుమాబ్‌ ఔషధం కొవిడ్‌తో ఆస్పత్రి బారినపడిన వారికి ఉపశమనం కలిగిస్తున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రాణవాయువుపై ఆధారపడడడం, ఆస్పత్రిలో చికిత్సా కాలాన్ని గణనీయంగా తగ్గిస్తోందని తేలింది. ముఖ్యంగా ఇన్‌ఫ్లమేషన్‌ అధికంగా ఉన్న రోగులు త్వరగా కోలుకునేందుకు ఈ ఔషధం ఎంతగానో సాయపడుతుందని స్వీడన్‌లో జరిగిన అధ్యయంలోనూ వెల్లడైంది. ఈ నేపథ్యంలో టోలిసిజుమాబ్‌ ఔషధానికి భారీ డిమాండ్‌ ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని