Published : 14/11/2021 01:23 IST

supreme court: సీజేఐ, సొలిసిటర్‌ జనరల్‌ మధ్య ఆసక్తికర సంభాషణ

దిల్లీ: సుప్రీంకోర్టులో దిల్లీ కాలుష్యం కేసు వాదనల సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. దిల్లీ కాలుష్యానికి రైతులు కారణమన్న తుషార్ మెహతా వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ.. రైతులపైనే నెపం మోపడం సరికాదని అన్నారు. దీనిపై వివరణ ఇచ్చిన తుషార్  మెహతా కాలుష్యానికి రైతులు మాత్రమే కారణం అన్నది తన ఉద్దేశం కాదని తెలిపారు. దీనిపై తిరిగి స్పందించిన సీజేఐ.. దురదృష్టవశాత్తూ తాను ఆంగ్ల భాషను చక్కగా వ్యక్తీకరించలేనని తెలిపారు. ఆంగ్లాన్ని తాను 8వ తరగతి నుంచి చదువుకోవడం ప్రారంభించానని వివరించారు. న్యాయవిద్యను ఆంగ్ల భాషలో చదువుకున్నానని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. దీనికి సమాధానమిచ్చిన తుషార్ మెహతా తాను కూడా 8వ తరగతి నుంచే ఆంగ్లం చదువుకోవడం ఆరంభించానని, న్యాయవిద్యను ఆంగ్లంలోనే అభ్యసించానని వివరించారు. అంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని