Published : 01/12/2021 23:02 IST

Gender change: ‘స్వేచ్ఛగా జీవిస్తా’.. పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్​కు అనుమతి

భోపాల్‌:  మధ్యప్రదేశ్‌ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. పురుషుడిగా మారాలనుకున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అన్ని అంశాలు పరిశీలించిన ప్రభుత్వం తాజాగా ఆమె లింగ మార్పిడికి అనుమతించింది. పురుషుడిగా మారాలనుకుంటున్న మహిళా కానిస్టేబుల్​కు రాష్ట్ర హోంశాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు అదనపు చీఫ్​ సెక్రటరీ(హోంశాఖ) డాక్టర్​ రాజేశ్​ రాజోరా తెలిపారు. ‘మహిళ నుంచి పురుషుడిగా మారేందుకు ప్రభుత్వ విభాగం అనుమతించటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తన చిన్నతనం నుంచే ఆమె పురుష లక్షణాలను కలిగి ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఈ కారణంగానే ఆమె లింగ మార్పిడికి హోంశాఖ అనుమతులిచ్చింది’ అని  అదనపు చీఫ్​ సెక్రటరీ డా.రాజేశ్​ రాజోరా వెల్లడించారు.

లింగమార్పిడికి అనుతించాలని సదరు మహిళా కానిస్టేబుల్​ 2019లో పోలీస్​ హెడ్​క్వార్టర్స్​కు దరఖాస్తు పంపించారని, దాంతో పాటు అఫిడవిట్​ దాఖలు చేసినట్లు రాజేశ్​ రాజోరా తెలిపారు. నిబంధనలకు లోబడే లింగ మార్పిడికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

కానిస్టేబుల్‌ హర్షం

తాజా ప్రభుత్వ నిర్ణయంతో సదరు కానిస్టేబుల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ అనుమతితో నా జీవితమే మారిపోనుందని.. ఇకపై స్వేచ్ఛగా, పరిపూర్ణంగా జీవించగలుగుతానని ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను స్త్రీ శరీరంలో చిక్కుకున్న పురుషుడిని. నా జీవనశైలిని పురుషుడిగా మార్చుకున్నప్పటకీ.. అమ్మాయిలా జీవిస్తూ నన్ను నేను మోసం చేసుకోలేక నిత్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను’ అంటూ ఆవేదన చెందారు. ‘మా గ్రామంలో చిన్నప్పటినుంచే నన్ను టామ్‌బాయ్‌ అని పిలిచేవారు. మహిళల కోటాలో ఏడేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం నా సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది’ అని వెల్లడించారు.

 

Read latest National - International News and Telugu News

 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని