Third Wave: మరో రెండు వారాల పాటు కేసులపెరుగుదల కొనసాగితే..!

దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అందుకు ఒమిక్రాన్ తోడైంది.

Published : 27 Dec 2021 17:35 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అందుకు ఒమిక్రాన్ తోడైంది. దాంతో ఈ పరిస్థితి మూడో వేవ్‌కు దారితీస్తుందనే భయం వ్యక్తం అవుతోంది. అది ఎంతవరకు నిజం అవుతుందనే దానిపై  వైద్య నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మరో రెండు వారాల పాటు స్థిరంగా కేసుల పెరుగుదల కొనసాగితే.. మూడో వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. 

‘మరో రెండు వారాలపాటు స్థిరంగా కేసులు పెరిగితే.. మరో వేవ్‌ ప్రారంభమైందో లేదో స్పష్టమవుతుంది. ఆ అంకెలను తీసుకువచ్చి గ్రాఫ్ గీస్తే.. అది అప్‌వర్డ్ కర్వ్‌ను చూపుతుంది. అది మరో వేవ్‌ను సూచిస్తుంది. ప్రస్తుతం అధికారులు ఈ ధోరణిని నిశితంగా గమనించాలి. అయితే గత కొద్దిరోజులుగా దిల్లీ, ముంబయిలో కేసులు పెరుగుతున్నప్పటికీ.. దేశ వ్యాప్తంగా మాత్రం ఆ పెరుగుదల కనిపించడం లేదు. మరోపక్క ప్రపంచ వ్యాప్తంగా డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్ భర్తీ చేస్తోంది. అయితే దీని వల్ల స్వల్ప స్థాయి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ సోకడం వల్ల, టీకాల వల్ల భారతీయులకు రోగ నిరోధక శక్తి లభించడంతో.. తదుపరి వేవ్ అంతప్రమాదకరంగా ఉండకపోవచ్చు’ అని వైద్య నిపుణులు వెల్లడించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని