Lakhimpur Kheri violence: వెనక్కి తగ్గని వరుణ్.. ఈసారి వాజ్‌పేయీ వీడియో షేర్‌ చేసిన ఎంపీ

సాగుచట్టాలకు మద్దతు ఇస్తూ, లఖింపుర్ ఖేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తోన్న భాజపా నేత వరుణ్ గాంధీ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు

Published : 14 Oct 2021 19:09 IST

దిల్లీ: సాగుచట్టాలకు మద్దతు ఇస్తూ, లఖింపుర్ ఖేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తోన్న భాజపా నేత వరుణ్ గాంధీ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే రైతులకు మద్దతు పలికి తన పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో చోటు కోల్పోయారు. ఇదేం పట్టించుకోకుండా తాజాగా రైతులకు మద్దతుగా నిలిచిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి చెందిన వీడియోను షేర్ చేశారు. అందులో వాజ్‌పేయీ అన్నదాతలకు అండగా నిలిచి, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కనిపించారు. ఆ వీడియో ఎప్పటిదో మాత్రం స్పష్టత లేదు. 

‘రైతులను భయపెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. మమ్మల్ని భయపెట్టేందుకు ప్రయత్నించవద్దు. అలాగే రైతులు భయపడాల్సిన పనిలేదు. మేము రైతుల ఉద్యమాన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదు. నిజాయతీతో కూడిన వారి డిమాండ్లకు మద్దతు ఇస్తాం. ప్రభుత్వం చట్టాలను దుర్వినియోగం చేయాలని చూసినా, వారి ఉద్యమాన్ని విస్మరించాలని ప్రయత్నించినా.. మేం కూడా ఆ ఉద్యమంలో భాగం అవుతాం’ అని వాజ్‌పేయీ అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘విశాల హృదయం ఉన్న నేత నుంచి వచ్చిన తెలివైన మాటలు’ అంటూ వరుణ్ ఈ వీడియోకు వ్యాఖ్యను జోడించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని