Published : 28/11/2021 23:35 IST

POCSO Court: ఒక్కరోజులోనే తీర్పు.. రేప్‌ కేసులో దోషికి జీవిత ఖైదు!

రాంచీ: అత్యాచారానికి సంబందించిన ఓ కేసులో పొక్సో న్యాయస్థానం ఒక్క రోజులోనే విచారణ జరిపి, తీర్పు వెలువరించింది. బిహార్‌లోని అరారియా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి అక్కడి పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇలా పోక్సో కేసును ఒకేరోజులో విచారణ జరిపి అత్యంత వేగంగా తీర్పు వెలువరించిన న్యాయస్థానంగా రికార్డు సాధించింది.

బిహార్‌లోని అరారియా జిల్లాలో ఈ ఏడాది జులై 22న ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆ ఘటనపై మరుసటి రోజు ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. ఈ కేసును అరారియా మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌ రీటా కుమారి పర్యవేక్షించారు. ఈ కేసును విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేశారు. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్‌ రాయ్‌ విచారణ జరిపారు. అనంతరం దోషిగా తేల్చిన న్యాయమూర్తి.. జీవిత ఖైదు శిక్షను ఖరారు చేశారు. ముద్దాయికి రూ.50వేల జరిమానా విధించారు. అలాగే, బాధితురాలికి రూ.7లక్షలు పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించారు.

అక్టోబర్‌ 4న ఈ ఆదేశాలు జారీ అయినప్పటికీ ఈ కేసుకు సంబంధించిన ఆదేశాల సమాచారం నవంబర్‌ 26న అందుబాటులోకి వచ్చింది. ఒక్కరోజులోనే పోక్సో న్యాయస్థానం విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించడం పట్ల బిహార్‌ హోంశాఖ హర్షం వ్యక్తం చేసింది. అత్యంత వేగంగా విచారణ జరిపి ఒక్కరోజులోనే శిక్షను విధించడం దేశంలో ఇదే తొలిసారి కావచ్చని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్యామ్‌లాల్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. 2018 ఆగస్టులో జరిగిన ఓ అత్యాచారం కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన దతియా జిల్లా న్యాయస్థానం కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తిచేసి దోషికి జీవిత ఖైదు ఖరారు చేసింది.

 Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని