India Corona : 28 వేల కేసులు.. 26 వేల రికవరీలు

కొత్త కేసులు  స్వల్పంగా తగ్గి మరోసారి 30 వేలలోపే నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా 300లోపే ఉండటం ఊరట కలిగిస్తోంది.

Updated : 26 Sep 2021 11:11 IST

దిల్లీ : దేశంలో కరోనా కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే కొత్త కేసులు  స్వల్పంగా తగ్గి మరోసారి 30 వేలలోపే నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా 300లోపే ఉండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికంటే ఎక్కువగా ఆ రాష్ట్రంలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

* గడిచిన 24 గంటల్లో 14,88,945 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 28,326 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

* నిన్న 260 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,46,918కి చేరింది.

*ఇక కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 26,032 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.29 కోట్లు(97.77%) దాటింది.

*ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3,03,476(0.90%)గా ఉంది.

* ఇక కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 16,671 కేసులు.. 120 మరణాలు చోటుచేసుకున్నాయి.

*ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న 68,42,786 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 85,60,81,527కి చేరింది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని