India Corona : భారీగా తగ్గిన కొత్త కేసులు.. మెరుగ్గా రికవరీ రేటు
దేశంలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. కొత్త కేసులు 9 వేలకు దిగువన నమోదయ్యాయి. ఇవి 9 నెలల కనిష్ఠానికి చేరాయి.
దిల్లీ : దేశంలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. కొత్త కేసులు 9 వేలకు దిగువన నమోదయ్యాయి. ఇవి 9 నెలల కనిష్ఠానికి చేరాయి. మరోవైపు మరణాలు కూడా 200 లోపే ఉండటం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..
* నిన్న 11,07,617 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,865 కేసులు బయటపడ్డాయి. 287 రోజుల కనిష్ఠానికి ఇవి చేరుకున్నాయి. మరోవైపు కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ రాష్ట్రం నుంచే 4,547 కేసులు..57 మరణాలు ఉండటం గమనార్హం.
* నిన్న కరోనాతో చికిత్స పొందుతూ 197 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,852కి చేరింది.
* గత కొన్ని రోజులుగా రికవరీలు కూడా మెరుగ్గానే ఉంటున్నాయి. నిన్న ఒక్క రోజే 11,971 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి ఆ రేటు 98.27 శాతానికి చేరింది.
* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,30,793కి తగ్గి.. ఆ రేటు 0.38 శాతానికి పడిపోయింది. ఇవి 525 రోజుల కనిష్ఠానికి చేరాయి.
*మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 59,75,469 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,12,97,84,045కి చేరింది.
* ఇక ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన అస్ట్రాజెనెకా టీకాల సంఖ్య 2 బిలియన్ల డోసుల మైలురాయిని చేరుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు
-
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 19,600 పైకి నిఫ్టీ
-
Ashwin: అదృష్టమంటే అశ్విన్దే.. అనుకోకుండా మళ్లీ ప్రపంచకప్ జట్టులో!
-
Abhishek Banerjee: నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు.. ఈడీ సమన్లపై అభిషేక్ బెనర్జీ
-
Rain: హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
-
The Sycamore Gap: ప్రఖ్యాత సైకమోర్ గ్యాప్ వృక్షం నరికివేత.. 16 ఏళ్ల బాలుడి దుశ్చర్య..!