India Corona : భారీగా నమోదైన మరణాలు.. ఎందుకంటే..?

దేశంలో కరోనా వ్యాప్తి స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. అయితే మరణాల సంఖ్య మత్రం ఇటీవల ఎప్పుడు చూడని విధంగా భారీ సంఖ్యలో నమోదైంది.

Updated : 05 Dec 2021 13:03 IST


దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఇటీవల ఎప్పుడు చూడని విధంగా భారీ సంఖ్యలో నమోదైంది. ఇందుకు కారణం పలు రాష్ట్రాలు ఆ సంఖ్యను సవరించడమే. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో 12,26,064 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,895 కేసులు వెలుగులోకి వచ్చాయి.

* ఇక నిన్న ఒక్క రోజే 2796 మరణాలు నమోదయ్యాయి. బిహార్‌, కేరళ రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరించడంతో ఆ సంఖ్య ఈ స్థాయికి చేరింది. బిహార్‌లో నిన్న 2,426 మరణాలు నమోదైనట్లు పేర్కొనగా.. కేరళలో 263 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన మరణాల సంఖ్య 4,73,326కి చేరాయి.

* ఇక నిన్న 6918 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 34 కోట్లు దాటి, ఆ రేటు 98.35 శాతానికి చేరింది.

* ప్రస్తుతం క్రియాశీల కేసులు 99,155గా ఉండి.. ఆ రేటు 0.29 శాతానికి తగ్గింది.

* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 1,04,18,707 మందికి టీకా అందించగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 127 కోట్లు దాటింది.

దేశంలో నాలుగుకు చేరిన ఒమిక్రాన్‌ కేసులు
ఇక దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటికే దేశంలో నాలుగు కొత్త వేరియంట్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో కర్ణాటకలో రెండు నమోదు కాగా.. గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఒక్కో కేసు నమోదైంది. మరికొంత మంది అనుమానితుల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.

కేసులు పెరుగుతున్నాయ్‌.. జాగ్రత్త
కొవిడ్‌ కేసులు, వారపు పాజిటివిటీ రేటు, మరణాలు పెరుగుతుండటంతో 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి నిర్దుష్టమైన చర్యలు చేపట్టాలంటూ ఈ మేరకు కర్ణాటక, కేరళ, తమిళనాడు,ఒడిశా, మిజోరం,జమ్ముకశ్మీర్‌లకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి నిన్న లేఖలు రాశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని