India Corona: మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులెన్నంటే?

దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న 38,353 మంది కొవిడ్‌ బారిన పడగా.. ఇవాళ ఆ సంఖ్యలో కాస్త పెరుగుదల నమోదైంది. గడిచిన

Updated : 12 Aug 2021 10:49 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో 38,353 మంది కొవిడ్‌ బారిన పడగా.. ఇవాళ ఆ సంఖ్యలో కాస్త పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 21,24,953 కరోనా పరీక్షలు చేయగా 41,195 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు చేసిన కొవిడ్‌ పరీక్షల సంఖ్య 48,73,70,196కి చేరింది. వైరస్‌ బారిన పడి మరో 490 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య మొత్తం 4,29,669కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 3,87,987 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 48.73 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు వివరించింది. కరోనా రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. కేరళలో అత్యధికంగా 23,500, మహారాష్ట్రలో 5,560, ఆంధ్రప్రదేశ్‌లో 1869, తమిళనాడులో 1964, కర్ణాటకలో 1826, పశ్చిమబెంగాల్‌లో 639 కేసులు నమోదయ్యాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని