Updated : 23/08/2021 12:06 IST

India Corona: 5 నెలల కనిష్ఠానికి ఉద్ధృతి.. భారీగా తగ్గిన కొత్త కేసులు

1.03 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు 19 శాతం మేర తగ్గి, 25 వేలకు చేరాయి. సుమారు ఐదు నెలల కనిష్ఠానికి క్షీణించాయి. క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. 

24 గంటల వ్యవధిలో  25,072 మంది మహమ్మారి బారిన పడగా..389 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం కేసులు 3.24కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756గా ఉంది. నిన్న 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్ల(97.63 శాతం)కు చేరాయి. కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924(1.03 శాతం) మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న కేవలం 7,95,543 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 58.25 కోట్లకు చేరింది. 



Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని