India Corona: 25 వేలకు దిగొచ్చిన కేసులు.. 75 కోట్లు దాటిన టీకా డోసులు

వరుసగా మూడో రోజు 30 వేల దిగువనే కరోనా కొత్త కేసులు..మళ్లీ పెరిగి, 300 దాటిన మరణాలు.. ఇవి మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా లెక్కలు. గత కొంతకాలంగా స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో వైరస్ వ్యాప్తి కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. కేరళ, మహారాష్ట్రలో కూడా పరిస్థితులు అదుపులో ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 

Updated : 14 Sep 2021 13:03 IST

దిల్లీ: దేశంలో వరుసగా మూడో రోజు 30 వేల దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం 300 దాటాయి. ఇక కేరళ, మహారాష్ట్రలో కూడా పరిస్థితులు అదుపులో ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. కేరళలో నిన్న 15,058 కొత్త కేసులు.. 99 మరణాలు వెలుగులోకి వచ్చాయి.

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14,30,891 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..25,404 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. 339 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క హరియాణా రాష్ట్రంలోనే 121 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక దేశంలో మొత్తం కేసులు 3.32 కోట్ల మార్కును దాటగా.. మరణాల సంఖ్య 4,43,213కి చేరింది.

నిన్న 37వేల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ నుంచి బయటపడిన వారి సంఖ్య 3.24కోట్లు(97.58 శాతం)గా ఉంది. ప్రస్తుతం 3,62,207(1.09 శాతం)క్రియాశీల కేసులు ఉన్నాయి.

75 కోట్ల టీకా డోసుల పంపిణీ.. ఈ ఏడాది జనవరిలో మనదేశంలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి కేంద్రం ఇప్పటి వరకూ 75,22,38,324 టీకా డోసుల్ని పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 78,66,950 మంది టీకా వేయించుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని