India Corona: కేసులు, మరణాల్లో ముందువరుసలో కేరళ
24 గంటల వ్యవధిలో 15,79,761 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..30,570 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేసులు ముందురోజు కంటే 12 శాతం మేర పెరిగాయి. మహమ్మారి కారణంగా నిన్న 431 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3,33,47,325 మందికి వైరస్ సోకగా.. 3,25,60,474 కోలుకున్నారు. 4,43,928 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
మళ్లీ 30 వేలు దాటిన కొత్త కేసులు
76 కోట్ల టీకా డోసుల పంపిణీ
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గిన కేసులు మళ్లీ 30వేల మార్కును దాటాయి. మృతుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో 15,79,761 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..30,570 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేసులు ముందురోజు కంటే 12 శాతం పెరిగాయి. మహమ్మారి కారణంగా నిన్న 431 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,33,47,325 మందికి వైరస్ సోకగా.. 3,25,60,474 కోలుకున్నారు. 4,43,928 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 3.42 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 38 వేల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.03 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.64 శాతానికి చేరింది.
కేరళలోనే 17 వేల కేసులు.. దేశంలో నమోదవుతోన్న కరోనా కొత్త కేసుల్లో సగానికి పైగా కేరళ రాష్ట్రంలోనే బయటపడుతున్నాయి. అక్కడ నిన్న 17,681 మందికి వైరస్ సోకింది. 208 మంది మరణించారు. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో 3,783 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కూడా కరోనా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ 1,402 మంది కరోనా బారినపడ్డారు.
76 కోట్ల టీకా డోసుల పంపిణీ.. గత కొంతకాలంగా టీకా పంపిణీలో వేగం కనిపిస్తోంది. నిన్న 64.51లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 76 కోట్ల మార్కును దాటింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
-
Sports News
IND vs AUS : ‘రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
-
Politics News
KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్
-
Movies News
Ugadi: ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్లో సందడి..
-
India News
Aadhaar: ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!