India Corona: లక్షకు దిగివచ్చిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. ఆదివారం 7,62,268 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,309 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి.

Updated : 29 Nov 2021 09:52 IST

544 రోజుల కనిష్ఠానికి యాక్టివ్‌ కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. ఆదివారం 7,62,268 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,309 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా 3.45 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 3.40 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 9,905 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. అవి 544 రోజుల కనిష్ఠానికి పడిపోయి.. 1,03,859గా ఉన్నాయి. క్రియాశీల రేటు 0.30 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.34 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 236 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 4,68,790 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇక నిన్న 42 లక్షల మంది టీకా వేయించున్నారు. మొత్తంగా 122 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని