India Corona: కొత్త కేసులు, రికవరీలు.. 8 వేలే..!

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇద్దరిలో ఈ వేరియంట్ వెలుగుచూడగా, మరికొందరు అనుమానితులు పర్యవేక్షణలో ఉన్నారు. ఈ వేరియంట్‌పై కలవరపడాల్సిన పనిలేదని.. ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే తాజా కరోనా గణాంకాలను విడుదల చేసింది.

Published : 04 Dec 2021 10:46 IST

లక్ష దిగువనే క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇద్దరిలో ఈ వేరియంట్ వెలుగుచూడగా, మరికొందరు అనుమానితులు పర్యవేక్షణలో ఉన్నారు. ఈ వేరియంట్‌పై కలవరపడాల్సిన పనిలేదని.. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే తాజా కరోనా గణాంకాలను విడుదల చేసింది. 

నిన్న 12,52,596 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,603 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు తగ్గాయి. అలాగే నిన్న 8,190 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు లక్ష దిగువనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 99,974గా ఉంది. క్రియాశీల రేటు 0.29 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.35 శాతంగా ఉందని కేంద్రం వెల్లడించింది.

గత ఏడాది ప్రారంభం నుంచి 3.46 కోట్ల మందికి కరోనా సోకగా..3.40 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 415 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా 4.7లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇక నిన్న 73.6 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తం మీద 126 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని