Updated : 09/12/2021 14:10 IST

India corona: కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువ..!

130 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ..

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కలవరం మొదలైనప్పటికీ.. ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత కొద్ది కాలంగా కొత్త కేసులు 10 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 12,89,983 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,419 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 11 శాతం అదనంగా కేసులు వెలుగుచూశాయి. అందులో 23 మంది ఒమిక్రాన్‌తో బాధపడుతున్నారు. 24 గంటల వ్యవధిలో 159 మంది మరణించారు. ఒక్క కేరళలోనే 5 వేలకు పైగా కేసులు, 112 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకూ 3.46 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.74 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.

నిన్న 8,251 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.40 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం 94,742 క్రియాశీల కేసులున్నాయి. క్రియాశీల రేటు 0.27 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.36 శాతంగా కొనసాగుతోంది. ఇక నిన్న 80.8 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 130 కోట్ల మార్కును దాటిందని కేంద్రం వెల్లడించింది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని