Flight: అంతర్జాతీయ విమానాలకు భారత్‌ పచ్చజెండా

అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్‌ పచ్చజెండా ఊపింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్‌ 15 నుంచి పునరుద్ధరించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన

Updated : 27 Nov 2021 07:09 IST

డిసెంబర్‌ 15 నుంచి రాకపోకలు

దిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్‌ పచ్చజెండా ఊపింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్‌ 15 నుంచి పునరుద్ధరించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.  కరోనా వచ్చిన తర్వాత భారత్‌ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించినా.. కొన్ని దేశాలతో ‘ఎయిర్‌ బబుల్‌’ ఒప్పందం కుదుర్చుకొని.. పరిమిత ఆంక్షలతో ప్రత్యేక విమానాలను నడుపుతూ వచ్చింది. తాజా ప్రకటనతో ఇక భారత్‌ నుంచి, బయటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణాఫ్రికాలో వచ్చిన కొత్త వేరియంట్‌ కారణంగా.. ప్రభుత్వం శుక్రవారం యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్సువానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించింది. ఇందులో ‘ఎయిర్‌ బబుల్‌’ ఒప్పందం ఉన్న దేశాలకు ఎప్పట్లానే ప్రత్యేక విమాన సర్వీసులు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని