Omicron: ఊహించని ముప్పులో చిక్కుకోక ముందే అప్రమత్తం కావాలి..!

ఒమిక్రాన్ వేరియంట్‌గా కొత్త రూపం ధరించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరం పుట్టిస్తోంది. ఈ వేరియంట్ దెబ్బకు బ్రిటన్‌ అల్లాడిపోతోంది. అక్కడ ఒమిక్రాన్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఒకవేళ మనదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ప్రభుత్వాలకు సూచించారు.

Updated : 20 Dec 2021 15:22 IST

దిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరం పుట్టిస్తోంది. ఈ వేరియంట్ దెబ్బకు బ్రిటన్‌ వణికిపోతోంది. అక్కడ ఒమిక్రాన్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఒకవేళ మనదేశంలో కూడా అటువంటి పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ప్రభుత్వాలకు సూచించారు.

‘యూకే తరహాలో ఇక్కడ పరిస్థితులు దిగజారవని ఆశిద్దాం. కానీ, మనం పరిస్థితులకు తగ్గట్లు సిద్ధంగా ఉండాలి. ఒమిక్రాన్‌కు సంబంధించి మరింత సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రపంచంలో ఏ ప్రాంతంలో కేసులు పెరిగినా.. వాటిని నిశితంగా పరిశీలించి, సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. ప్రజలు ఊహించని ముప్పులో చిక్కుకోవడం కంటే.. అప్రమత్తంగా ఉండటం అన్నింటికన్నా మేలు’ అంటూ గులేరియా మీడియాకు వెల్లడించారు.

ఒమిక్రాన్‌తో బ్రిటన్‌ హడలిపోతోంది. అక్కడ ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 37 వేలకు చేరింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో ఇప్పటివరకు 150కి పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 54 మంది ఈ వేరియంట్ బారినపడ్డారు. యూకేలో పరిస్థితే భారత్‌లో వస్తే.. రోజుకు సుమారు 14లక్షలకు పైగా కేసులు వచ్చే అవకాశం ఉందని గతంలోనే కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు