Published : 21 Dec 2021 21:37 IST

Indian Vaccine: వ్యాక్సిన్‌ మైత్రి.. 94 దేశాలకు భారత టీకాలు!

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని ముమ్మరంగా చేపట్టాయి. ఇలాంటి కీలక సమయంలో కొవిడ్‌-19ను నిరోధించే వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ కీలకంగా మారింది. దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకూ కరోనా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 15నాటికి 94 దేశాలకు 9.83కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు మరో రెండు ఐరాస గుర్తించిన ప్రాంతాలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ సరఫరా చేసినట్లు తెలిపింది.

వ్యాక్సిన్‌ మైత్రిలో భాగంగా విదేశాలకు గ్రాంటుగా, వాణిజ్యపరంగా లేదా ప్రపంచ ఆరోగ్యసంస్థ నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్‌ (COVAX) కార్యక్రమం ద్వారా 94 దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 150కుపైగా దేశాలకు కొవిడ్‌-19 సంబంధిత వైద్య సహకారాన్ని అందించామని చెప్పారు. అదేవిధంగా దేశంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ సమయంలో దాదాపు 50దేశాల నుంచి భారత్‌కు కొవిడ్‌ సంబంధిత వైద్య పరికరాలు, ఔషధాల సహకారం అందిందని వెల్లడించారు. విదేశీ ప్రభుత్వాలే కాకుండా అక్కడి ప్రైవేటు సంస్థలు కూడా ఈ సహాయాన్ని అందించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇదిలాఉంటే, ప్రపంచంలో అధిక మొత్తంలో కరోనా వ్యాక్సిన్‌ తయారు చేస్తోన్న దేశాల్లో భారత్‌ అగ్రగామిగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పుణె కేంద్రంగా ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థగా పేరుగాంచింది. ఇప్పటికే అక్కడ కొవిషీల్డ్‌తో పాటు పలు రకాల కరోనా వ్యాక్సిన్‌లు భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక అవసరాలను చూసుకుంటూనే వ్యాక్సిన్‌ మైత్రి పేరుతో విదేశాలకు ఎగుమతికి భారత ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని