చైనాకు దీటైన జవాబు.. గల్వాన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సైన్యం

కొత్త ఏడాది రోజు గల్వాన్ లోయలో తాము కూడా పతాకావిష్కరణ చేసినట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది.......

Updated : 04 Jan 2022 22:31 IST

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో కొత్త సంవత్సరం ప్రారంభంరోజున జాతీయ పతాకం ఎగురవేసి ఆ ప్రాంతం తమదే అని చైనా సైన్యం పరోక్షంగా చాటే ప్రయత్నం చేసిన వేళ భారత సైన్యం కూడా అందుకు దీటుగా స్పందించింది. కొత్త ఏడాది మొదలైన రోజు గల్వాన్ లోయలో తాము కూడా పతాకావిష్కరణ చేసినట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పలు చిత్రాలను విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద తుపాకులు చేతబట్టి, త్రివర్ణ పతాకం ఎగురవేస్తూ సైనికులు ఫొటోలు దిగారు. సుమారు 30 మంది సైనికులు ఫొటోల్లో కనిపిస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

గల్వాన్ లోయలో చైనా జెండా ఎగురవేయడంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగగా, భారత సైన్యం ఇప్పటికే దానిపై వివరణ ఇచ్చింది. పతాకావిష్కరణకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. అయితే చైనా ఆధీనంలో ఉన్న వివాదరహిత ప్రాంతంలోనే డ్రాగన్ పతాకావిష్కరణ చేసినట్లు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని