
Priyanka Gandhi: ప్రియాంక పిల్లల ఇన్‌స్టా ఖాతాలు హ్యాక్ కాలేదు..!
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
దిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఇద్దరు పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలు హ్యాక్ కాలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT-In నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపాయి. తన పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందని రెండు రోజుల క్రితం ప్రియాంక ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై స్పందించమనగా.. ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఫోన్ ట్యాపింగే కాదు.. వాళ్లు నా పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. వాళ్లకు వేరే పనిలేదా..?’ అని వ్యాఖ్యానించారు. కానీ, అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఈ ఆరోపణల్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం సైబర్ సెక్యూరిటీ టీమ్‌తో దర్యాప్తు చేయించనున్నట్లు నిన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారంతో ఇటీవల పలువురు నేతలు నుంచి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.