Omicron: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అంతర్జాతీయ విమానాలపై డీజీసీఏ కీలక నిర్ణయం!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన...

Published : 01 Dec 2021 19:50 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు డీజీసీఏ వెల్లడించింది. అయితే, కొత్త తేదీలను తర్వాత తెలియజేయనున్నట్టు పేర్కొంది. డెల్టా కంటే అత్యంత వేగంగా పలు దేశాలకు ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే షెడ్యూల్‌ చేసిన అంరత్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత గతేడాది మార్చి నుంచి కేంద్రం అంతర్జాతీయ సర్వీసుల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో డిసెంబర్‌ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు శుక్రవారం పచ్చజెండా ఊపింది. తాజాగా ఒమిక్రాన్‌ భయాలు వ్యక్తమవుతున్న వేళ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని