Corona Vaccine: మూడో డోసు పడితేనే డెల్టాకు మూడుతుంది!

కొవిడ్‌-19 కట్టడికి మూడో డోసు ఇచ్చే అంశం నేడు తీవ్ర చర్చనీయాంశమైంది.

Published : 24 Aug 2021 11:46 IST

‘బూస్టర్‌’ ఆవశ్యకతపై శాస్త్రవేత్తల వాదన 

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 కట్టడికి మూడో డోసు ఇచ్చే అంశం నేడు తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇప్పటికీ మొదటి రెండు డోసులనే పొందని దశలో ఇది సరైన ఆలోచనేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనలు మాత్రం బూస్టర్‌ డోసుల ఆవశ్యకతను సూచిస్తున్నాయి. ఇందుకు కారణం కరోనాలోని డెల్టా వేరియంట్‌. అధిక సాంక్రమిక శక్తి కలిగిన ఈ రకానికి, మానవ రోగ నిరోధక వ్యవస్థకు మధ్య నేడు ఒకింత పోటీ నెలకొంది. ఇందులో డెల్టానే పైచేయి సాధిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. పూర్తిస్థాయిలో టీకా పొందినవారిలోనూ ఈ వేరియంట్‌ వల్ల చాలా ఎక్కువగా వైరల్‌ లోడు ఉంటోందని వెల్లడైంది. అలాంటివారి నుంచి కూడా వైరస్‌ ఉద్ధృతంగా ఇతరుల్లోకి వ్యాపించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. వైరల్‌ లోడు ఎక్కువగా ఉండటం వల్ల యాంటీబాడీలతో డెల్టాకు అడ్డుకట్ట వేయడం మానవ రోగ నిరోధక వ్యవస్థకు కష్టమవుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. 


కొన్ని దేశాల్లో రెండు డోసుల టీకా పొందినవారిలో కాలక్రమేణా యాంటీబాడీలు తగ్గిపోతుండటం వల్ల కూడా బూస్టర్‌ ఆవశ్యకత పెరుగుతోంది. మూడో డోసు వల్ల అవి తిరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని పరిశోధకులు తెలిపారు. పైగా అవి శరీరంలో దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, కరోనాలోని వివిధ వేరియంట్లపై పోరాడే సామర్థ్యం వాటికి సమకూరుతుందని వివరించారు. దీనికితోడు.. ప్రారంభదశలో (ముక్కు, గొంతులో)నే డెల్టా వేరియంట్‌ను నిలువరించడానికీ వీలవుతుందని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని