Jan Dhan Yojna: 43 కోట్ల ఖాతాలు.. డిపాజిట్ల మొత్తం 1.46లక్షల కోట్లు

ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు చేరింది. అలాగే వాటిలో డిపాజిట్ల విలువ 1.46 లక్షల కోట్లుగా ఉంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక శాఖ వివరాలను వెల్లడించింది. అందరికి బ్యాకింగ్ సేవలు అందించేందుకు 2014 ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

Published : 28 Aug 2021 19:09 IST

దిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు చేరింది. అలాగే వాటిలో డిపాజిట్ల విలువ 1.46 లక్షల కోట్లుగా ఉంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక శాఖ వివరాలను వెల్లడించింది. అందరికి బ్యాంకింగ్ సేవలు అందించేందుకు 2014 ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

పీఎంజేడీవై ప్రారంభమై ఏడేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. భారత దేశ ఆర్థిక స్థితిగతులను ఈ పథకం శాశ్వతంగా మార్చివేసిందన్నారు. ‘జన్‌ధన్‌ యోజన లెక్కలేనంత మంది భారతీయులను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చింది. అలాగే వారి గౌరవాన్ని ఇనుమడింప జేసి, సాధికారతను కల్పించింది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి’ అని ఆయన వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. ఆగస్టు 18, 2021 నాటికి పీఎంజేడీవై ఖాతాల సంఖ్య 43.03 కోట్లకు చేరింది. ఇందులో 55.47 శాతం మంది ఖాతాదారులు మహిళలే. అలాగే 66.69 శాతం మంది ఖాతాదారులు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారని ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే మొత్తం ఖాతాల్లో 85.6 శాతం ఖాతాలు క్రియాశీలకంగా ఉన్నాయని పేర్కొంది. ఒక్కో ఖాతాలో సగటున రూ.3,398 ఉన్నట్లు తెలిపింది. అలాగే జన్‌ధన్ ఖాతాదారులకు జారీ అయిన రూపే కార్డుల సంఖ్య 31.23 కోట్లకు పెరిగింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని