Karnataka: హామీ పత్రం ఇస్తేనే టీకా వేసుకుంటా.. కర్ణాటకవాసి వినూత్న డిమాండ్​ 

కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్న డిమాండ్‌తో ముందుకొచ్చాడు. టీకా వేసుకుంటే తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావనే హామీ పత్రం ఇవ్వాలని కలెక్టర్​ను డిమాండ్​ చేశాడు......

Published : 29 Nov 2021 21:58 IST

బెంగళూరు: కొవిడ్‌ టీకాపై ఉన్న అపోహలను తొలగిస్తూ అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు మాత్రం టీకా తీసుకునేదుకు సంకోచిస్తూనే ఉన్నారు. కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్న డిమాండ్‌తో ముందుకొచ్చాడు. టీకా వేసుకుంటే తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావనే హామీ పత్రం ఇవ్వాలని కలెక్టర్​ను డిమాండ్​ చేశాడు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లా కలెక్టర్ నితీశ్ పాటిల్​ స్థానికులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. షాపింగ్ మాళ్లు, వ్యాయామశాలలు​, బార్లు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్​లకు చెందినవారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనంద్​ కుందనూర్​ అనే వ్యక్తి టీకా హామీ పత్రాన్ని ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వ్యాక్సిన్ వేసుకుంటే తనకు ఏ ఆరోగ్య సమస్యలూ రావనే హామీ పత్రం ఇవ్వాలని కోరారు. దీంతో చేసేదేమీలేక అధికారులందరూ హామీ పత్రంపై సంతకాలు చేశారు.

టీకా భయంతో ఇంటిపైకి ఎక్కిన వృద్ధుడు

టీకా వేసుకుంటే ఏమౌతుందో అనే భయంతో ఓ వృద్ధుడు ఇంటిపైకి ఎక్కాడు. ఈ ఘటన సైతం కర్ణాటకలోనే జరగింది. దావణగెరె జిల్లాలోని హదాడి గ్రామంలో ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కొవిడ్​ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన హనుమంతప్ప (77) టీకా తీసుకునేందుకు నిరాకరించాడు. వ్యాక్సిన్​ వద్దేవద్దంటూ ఇంటిపైకి ఎక్కి కూర్చున్నాడు. ఎలాగోలా హనుమంతప్పకు నచ్చజెప్పి టీకావేసి వెళ్లిపోయారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని