Kerala: కేరళలో ఆగని కరోనా ఉద్ధృతి.. 388 మంది మృతి

దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే.. కేరళలో మాత్రం వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 388 మంది మరణించటం ఆందోళన కలిగిస్తోంది......

Published : 17 Nov 2021 23:48 IST

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే.. కేరళలో మాత్రం వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళలో 6,849 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50.77 లక్షలకు, మరణాల సంఖ్య 36,475కు చేరింది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కొత్తగా 388 మరణాలను నివేదించింది. వీటిలో 61 మంది ఇటీవల చనిపోగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి 327 మంది కరోనాతో చనిపోయినట్లు తెలిపింది. బుధవారం మొత్తం 6,046 మంది వైరస్‌ నుంచి కోలుకున్నునారు. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 63,752కు చేరింది. మొత్తం 69,334 నమూనాలు పరీక్షించగా.. అత్యధికంగా ఎర్నాకులం జిల్లాలో 958, ఆ తర్వాత కోజికోడ్​లో 932, తిరువనంతపురంలో 839 కేసులు వెలుగుచూశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని