Kranti Redkar: మా భోజనం ఖర్చు ఇదేనండి.. మంత్రికి సెటైర్ వేసిన వాంఖడే భార్య

తన భర్త, ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తోన్న విమర్శలకు క్రాంతి రేడ్కర్ వాంఖడే దీటుగా బదులిచ్చారు. మళ్లీ రేపు ఎప్పుడైనా తాము తినే తిండి గురించి ఎవరూ వ్యాఖ్యలు చేయకుండా ఆధారాలతో సహా ట్వీట్ చేస్తున్నానన్నారు. మధ్యాహ్న భోజనానికి చేసిన ఖర్చు గురించి వెల్లడించారు. 

Published : 03 Nov 2021 01:49 IST

ముంబయి: తన భర్త, ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తోన్న విమర్శలకు క్రాంతి రేడ్కర్ వాంఖడే దీటుగా బదులిచ్చారు. మళ్లీ రేపు ఎప్పుడైనా తాము తినే తిండి గురించి ఎవరూ వ్యాఖ్యలు చేయకుండా ఆధారాలతో సహా ట్వీట్ చేస్తున్నానన్నారు. మధ్యాహ్న భోజనానికి చేసిన ఖర్చు గురించి వెల్లడించారు. 

‘మేం ఈ రోజు మధ్యాహ్న భోజనంలో దాల్‌ మఖ్నీ, జీరా రైస్ తీసుకున్నాం. జీరా రైస్ ఇంట్లో తయారు చేసిందే. దాల్ మఖ్నీ బయటనుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం. దాని ధర రూ.190. మళ్లీ భవిష్యత్తులో ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారికి సాధ్యంకాని రీతిలో మేం ఆహారానికి ఖర్చు చేస్తున్నాం అనొచ్చు. అందుకే ఆధారాలతో సహా వెల్లడిస్తున్నాను’ అని ట్విటర్‌లో క్రాంతి వ్యంగ్యంగా స్పందించారు. 

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన దగ్గరి నుంచి వాంఖడేపై మాలిక్ విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. పలువురిపై తప్పుడు కేసులు బనాయించి ఆ అధికారి కోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు. అలాగే రూ.70 వేల విలువైన చొక్కా, రూ. లక్ష విలువైన ట్రౌజర్, లక్షల విలువ చేసే చేతి గడియారాలు ధరిస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు. అయితే అవన్నీ పుకార్లని సమీర్ కొట్టిపారేశారు. ఆయనకు వాటి గురించి పెద్దగా తెలిసుండదని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని