Published : 14/08/2021 01:10 IST

Corona: టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌.. 0.05శాతమే..!

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొందరు వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే టీకా తర్వాత కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువే అని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53.14కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా.. కేవలం 0.048శాతం మంది అంటే దాదాపు 2.6లక్షల మంది మాత్రమే టీకా పొందిన తర్వాత కరోనా బారిన పడినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో 1,71,511 మందికి తొలి డోసు తీసుకున్న తర్వాత కొవిడ్‌ సోకగా.. 87వేల మంది రెండు డోసులు వేయించుకున్న తర్వాత వైరస్‌ బారిన పడినట్లు పేర్కొన్నాయి. 

వ్యాక్సినేషన్‌ తర్వాత వైరస్‌ సోకడాన్ని బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్‌గా పిలుస్తారు. కాగా.. టీకా తీసుకున్న వారిలో ప్రాణాపాయ ముప్పు తక్కువేనని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్, స్పుత్నిక్‌-వి టీకాల పంపిణీ జరుగుతుండగా.. ఈ మూడు వ్యాక్సిన్లు కూడా బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ ఇవ్వగలవని నిపుణులు తెలిపారు. 

అయితే టీకా తీసుకున్నవారిలో కొవిడ్‌ బారిన పడే అవకాశాలు చాలా తక్కువే అయినప్పటికీ ప్రస్తుతం ఎదురవుతున్న కరోనా వేరియంట్ల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి మరవొద్దని సూచిస్తున్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే మూడో దశ ముప్పును అడ్డుకోవచ్చని చెబుతున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని