Parliament: స్పీకర్‌ ఛైర్‌పైకి పత్రాలు విసిరిన కాంగ్రెస్‌ ఎంపీలు

పెగాసస్‌తో ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను

Updated : 28 Jul 2021 13:40 IST

దిల్లీ: పెగాసస్‌తో ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేతబట్టి గట్టిగట్టిగా నినాదాలు చేశారు. లోక్‌సభలో అయితే కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్‌ ఛైర్‌పైకి విసిరారు. దీంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి.

ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమే సభాపతి ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించేసి స్పీకర్‌ ఛైర్‌, ట్రెజరీ బెంచ్‌లపైకి విసిరేశారు. దీంతో ఆగ్రహానికి గురైన సభాపతి సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా వేశారు. విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

అటు రాజ్యసభలోనూ అదే గందరగోళం కన్పించింది. విపక్షాల నిరసనలతో ఈ ఉదయం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ 12 గంటలకు సభ మొదలవగా.. విపక్ష ఎంపీలు సీట్లలో నుంచి లేచి ఆందోళన చేపట్టారు. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని