Vaccine: మహారాష్ట్రలో ‘కోటి మంది’కి రెండు డోసులు పూర్తి..!

రాష్ట్రంలో కోటి మందికి పూర్తిస్థాయిలో రెండు డోసులను అందించినట్లు పేర్కొంది. దీంతో దేశంలో కోటి మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

Published : 26 Jul 2021 21:44 IST

వెల్లడించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ

ముంబయి: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను 18ఏళ్లుపైబడిన వారందరికీ సాధ్యమైనంత తొందరగా ఇచ్చేందుకు వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం సరాసరి 30లక్షలకు పైగా డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కోటి మందికి పూర్తిస్థాయిలో రెండు డోసులను అందించినట్లు పేర్కొంది. దీంతో దేశంలో కోటి మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

మహారాష్ట్రలో జులై 26నాటికి రెండు డోసుల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిసంఖ్య కోటి 64వేలుగా నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ ప్రదీప్‌ వ్యాస్‌ వెల్లడించారు. మరో 3కోట్ల 16లక్షల మంది కనీసం ఒకడోసు తీసుకున్నారని చెప్పారు. మొత్తంగా 4కోట్ల 13లక్షల డోసులను పంపిణీ చేసినట్లు ప్రకటించారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగానే కొనసాగుతోంది. ఇప్పటివరకు అక్కడ 4కోట్ల 44లక్షల డోసులను పంపిణీ చేశారు. గుజరాత్‌లో 3.16కోట్ల డోసులు, రాజస్థాన్‌లో 3కోట్ల డోసులను అందించారు.

10లక్షల డోసులు అందించాం..రిలయన్స్‌

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని ప్రైవేటు సంస్థలూ భారీ స్థాయిలో చేపడుతున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తమ సంస్థ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కలిపి ఇప్పటివరకు 10లక్షల డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ఏప్రిల్ నెలలో ప్రారంభించగా.. తమ సిబ్బందిలో 98శాతం మందికి వ్యాక్సిన్‌ అందించామని ప్రకటించింది. ఈ పది లక్షల డోసులను ఉచితంగానే పంపిణీ చేశామని రిలయన్స్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని