
Anand Mahindra: వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.. మహీంద్రా ఆగ్రహం
ముంబయి: నెట్టింట్లో సరదాగా స్పందిస్తూ, సందర్భానుసారంగా స్ఫూర్తి నింపుతూ మెప్పించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను నకిలీ వార్తలు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మహీంద్రా పేరుతో నెట్టింట్లో పలు ఫేక్ న్యూస్‌లు చక్కర్లు కొడుతుండటంతో ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. తాను చెప్పని మాటలను తనకు ఆపాదించడంపై అసహనం వ్యక్తం చేశారు. అవి పూర్తిగా కల్పిత వార్తలని స్పష్టం చేసిన ఆయన, అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అసలు మహీంద్రా ఆగ్రహానికి కారణం ఏంటంటే..?
‘సగటు భారతీయుడు నెట్టింట్లో మహిళలను అనుసరిస్తూ, క్రీడా జట్లపై తన ఆశలన్నీ పెట్టుకొని, తమ గురించి పట్టించుకోని రాజకీయ నాయకుల చేతిలో తన భవిష్యత్తును పెట్టేస్తున్నాడు’ అని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించినట్లుగా ఉన్న ఈ వాక్యం ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. start_upfounder అనే ఇన్‌స్ట్రాగాం ఖాతాలో ఇది అప్లోడ్ అయింది. దీనిపై మహీంద్రా ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మీమ్స్‌ను షేర్ చేసి, తానెప్పుడూ ఆ మాట చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు వీళ్లు ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇదే కాదు.. కొద్ది రోజుల కిందట కూడా మహీంద్రా పేరుతో నకిలీ వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారని, స్కూల్ పిల్లలకు స్టాక్ మార్కెట్ పాఠాలు చెప్పాలని మహీంద్రా సూచించారంటూ ట్వీట్లు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు మహీంద్రా కొట్టిపారేశారు. ట్విటర్లో ఆనంద్‌ను 80లక్షల మందికి పైగా అనుసరిస్తుండగా.. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
-
General News
Flipkart MoU: సెర్ప్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- AP Liquor: మద్యంలో విషం
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
- కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
- Amaravathi: రాజధాని భూముల అమ్మకం
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి