Nawab Malik: నన్నూ.. అనిల్‌ దేశ్‌ముఖ్‌లాగే ఇరికించాలని చూస్తున్నారు

కొందరు వ్యక్తులు తనను తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు. అందుకోసమే తనపై రెక్కీ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తూ.. దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. తననూ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వలే ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.

Published : 27 Nov 2021 18:41 IST

తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించిన నవాబ్ మాలిక్

ముంబయి: కొందరు వ్యక్తులు తనను తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు. అందుకోసమే తనపై రెక్కీ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తూ.. దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. తననూ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వలే ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.

‘అనిల్ దేశ్‌ముఖ్ మాదిరిగా నన్ను కూడా తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై ముంబయి పోలీసు కమిషనర్, హోం మంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేస్తాను. కొందరు నన్ను ఇరికించాలని చేస్తోన్న కుట్రకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఇద్దరు వ్యక్తులు నా ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారు. వారు ఎవరో తెలిస్తే.. దయచేసి నాకు తెలియజేయండి. ఆ ఫొటోల్లో ఉన్నవారికి నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా గురించి మీకు ఏదైనా సమాచారం కావాలంటే.. నేనే మీకు పూర్తి సమాచారం ఇస్తాను’ అని ట్వీట్ చేశారు. ముంబయిలోని క్రూయిజ్ నౌక  డ్రగ్స్‌ కేసులో ఈ మంత్రి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ఈ కేసును ఆయుధంగా వాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు