Amritsar: అమృత్‌సర్‌ స్వర్ణ మందిరంలోకి ఆగంతుకుడి చొరబాటు.. భక్తుల దాడిలో మృతి

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ మందిరంలోకి ఆగంతుకుడు చొరబడ్డాడు. మందిరంలోని గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్వర్ణ మందిరం భద్రతా సిబ్బంది ఆగంతుకుడిని అడ్డుకున్నారు. గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించడంత..

Updated : 19 Dec 2021 09:44 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ మందిరంలోకి ఆగంతుకుడు చొరబడ్డాడు. మందిరంలోని గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్వర్ణ మందిరం భద్రతా సిబ్బంది ఆగంతుకుడిని అడ్డుకున్నారు. గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించడంతో అక్కడే ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే అమృత్‌సర్‌ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అమృత్‌సర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేపు శవపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతిచెందిన వ్యక్తి వయసు 20-25 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడు ఎక్కడి నుంచి వచ్చాడో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని