
Twins: కవల పిల్లలే.. కానీ పుట్టిన సంవత్సరాలే వేరు!
శాక్రమెంటో: అమెరికాలోని కాలిఫోర్నియాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పుట్టింది కవల పిల్లలే అయినప్పటికీ వారి పుట్టిన తేదీ మాత్రమే కాదు.. ఏకంగా సంవత్సరాలే మారిపోయాయి. కలిసి పుట్టినప్పటికీ వారిద్దరు ఇకపై వేర్వేరు తేదీల్లో పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఇదెలా సాధ్యమైంది అని అనుకుంటున్నారా..?
కాలిఫోర్నియా రాష్ట్రం గ్రీన్ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్కు డిసెంబర్ 31న పురుటి నొప్పులు రావడంతో స్థానిక నతివిదాడ్ మెడికల్ సెంటర్కు తరలించారు. అదే రోజు రాత్రి 11.45 గంటలకు ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. 15 నిమిషాల అనంతరం 12.00 గంటలకు ఆడ శిశువు ఈ లోకానికి హాయ్ చెప్పింది. దీంతో మగశిశువు 2021లో పుట్టగా.. పాప 2022లో జన్మించినట్లయింది. ఈ విషయాన్ని సదరు మెడికల్ సెంటర్ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. వారి ఫొటోలను ఫేస్బుక్లో పంచుకుంటూ తల్లితోపాటు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపింది.
తన కవల పిల్లలు ప్రత్యేక తేదీల్లో జన్మించడంపై తల్లి మాడ్రిగాల్ ఆనందం వ్యక్తం చేశారు. ‘నా ట్విన్స్ వేర్వేరు పుట్టినరోజులు కలిగి ఉండటం క్రేజీగా ఉంది’ అని అన్నారు. మగ శిశువుకు ఆల్ఫ్రెడో అని, పాపకు అలీన్ అని పేర్లు పెట్టినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.