Mimi Chakraborty: మీ ప్రాంతంలో అన్ని సమస్యలుంటే.. ఫొటోల కోసం బాధపడుతున్నారా..?

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమ్‌ బెంగాల్‌ నటి మిమి చక్రవర్తి(Mimi Chakraborty) ఇప్పుడు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆమెకు గట్టిగా ఏడ్వాలనిపిస్తోంది. ఆమె ఇంతో ఇష్టపడి దాచుకున్న 7 వేల ఫొటోలు, 500 వీడియోలు ఫోన్ నుంచి డిలీట్ అవ్వడమే అందుకు కారణం.

Published : 17 Nov 2021 19:34 IST

ఏడువేల ఫొటోలు డిలీట్ అయ్యాయని ఎంపీ ట్వీట్‌

నెట్టింట్లో మిశ్రమ స్పందన

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమ్‌ బెంగాల్‌ నటి మిమి చక్రవర్తి(Mimi Chakraborty) ఇప్పుడు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆమెకు గట్టిగా ఏడ్వాలనిపిస్తోంది. ఆమె ఇంతో ఇష్టపడి దాచుకున్న 7 వేల ఫొటోలు, 500 వీడియోలు ఫోన్ నుంచి డిలీట్ అవ్వడమే అందుకు కారణం. వాటిని తిరిగి పొందేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నెట్టింట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను వాడుతోన్న యాపిల్‌ ఫోన్ సంస్థకు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆమె మార్కెట్‌లోకి రెండు నెలల క్రితం విడుదలైన ఐఫోన్ 13ను వాడుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఆమె ట్వీట్‌కు నెట్టింట్లో మిశ్రమ స్పందన వెల్లడైంది. కొందరు వాటిని ఎలా తిరిగి పొందొచ్చో సూచించారు. మరికొందరు మాత్రం ఎంపీగా బాధ్యతలు మరిచి, ఫొటోలు కోసం బాధపడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ‘ఎంతో మంది చిన్నారులు పాఠశాల చదువుకు దూరం అవుతున్నారు. అనేకమంది  ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ఎంపీ మేడమ్ మాత్రం డిలీట్ అయిన ఫొటోలు, వీడియోల కోసం బాధపడుతున్నారు’ అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించారు.నియోజవర్గ ప్రజలకు కాస్త సమయం కేటాయించే అవకాశం ఉందనుకుంటున్నానని మరొకరు ఘాటుగా వ్యాఖ్యానించారు. 

మిమి చక్రవర్తి జాదవ్‌పూర్ నియోజకవర్గ ఎంపీ. బెంగాల్‌లో పేరు పొందిన నటి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని