Live Telecast: లోక్​సభ సమావేశాల వీక్షణకు ప్రత్యేక యాప్​.. ప్రారంభించిన స్పీకర్

లోక్​సభ సమావేశాలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ సమావేశాలను లైవ్​లో చూసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యాప్‌ను రూపొందించగా మంగళవారం దాన్ని ప్రారంభించారు......

Published : 21 Dec 2021 21:43 IST

దిల్లీ: లోక్​సభ సమావేశాలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ సమావేశాలను లైవ్​లో చూసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యాప్‌ను రూపొందించగా మంగళవారం దాన్ని ప్రారంభించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్​ ఓం బిర్లా ‘ఎల్​ఎస్​ మెంబర్​ యాప్’​ను (LS Member App) ప్రారంభించారు. సభ్యులందరూ ఈ యాప్‌ను డౌన్​లోడ్​ చేసుకోవాలని పేర్కొన్నారు. తమ నియోజకవర్గ ప్రజలు కూడా వినియోగించుకునేలా​ కృషి చేయాలని కోరారు. ‘పార్లమెంటు సమావేశాలను యూజర్లు లైవ్​లో వీక్షించేందుకు వీలుగా ఈ యాప్​ను రూపొందించారు. ప్రశ్నోత్తరాలు, డిబెట్లు, బులెటిన్లు సహా సభ్యుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. పార్లమెంటుకు సంబంధించిన ముఖ్య పత్రాలు, వివిధ కమిటీల రిపోర్ట్​లను చూడొచ్చు’ అని ఓం బిర్లా తెలిపారు. 542 మంది పార్లమెంట్‌ సభ్యుల సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని